సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం రిపోర్టు పూర్తీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 5:44 AM GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం రిపోర్టు పూర్తీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల భారతదేశ చిత్ర పరిశ్రమ ఎంతగానో షాక్ కు గురైంది. పవిత్ర రిస్తా లాంటి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 2013 లో కాయ్ పోచే అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎంఎస్ ధోనీ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

పీకే, డిటెక్టివ్ బ్యోముకేష్ బక్షి, రాబ్తా, కేదార్ నాథ్, డ్రైవ్ లాంటి సినిమాల్లో నటించాడు. సుశాంత్ సింగ్ చివరి సినిమా 'చిచోరే' బాలీవుడ్ లో మంచి హిట్ ను అందుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'దిల్ బేచారా' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఇంతలో అతడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. సుశాంత్ సింగ్ పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు.

Next Story