సూర్యాపేట జిల్లాపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

By సుభాష్  Published on  26 April 2020 2:53 PM GMT
సూర్యాపేట జిల్లాపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా.. గత రెండు రోజుల నుంచి కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక రాష్ట్రంలోని సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌ యాప్‌ను ప్రారంభించారు. దీనికి డిమాండ్‌ కూడా భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం మటన్‌, చికెన్‌లను కూడా ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఇక సూర్యాపేట పట్టణంలోని తాజా పరిణామాలపై ఆదివారం జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కర్‌, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, పీఆర్డీఏ పీడీ కిరణ్‌ తదితర అధికారులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో కఠినమైన భద్రత చేపట్టాలని, ప్రజలు బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మటన్‌, చికెన్‌తో ఇతర సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్నట్లు తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్‌ ప్రాంతాల్లో ఉన్న సూర్యాపేట పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి పాలు, కూరగాయలు, వార్డుల వారీగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇక సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందు కోసం పట్టణ శివారులో ఉన్న ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హోల్‌సెల్‌ దుకణాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలంతా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

Next Story