షాకింగ్: ఒకే కుటుంబంలో ఐదు మృతదేహాలు..!

By సుభాష్  Published on  26 April 2020 2:14 PM GMT
షాకింగ్: ఒకే కుటుంబంలో ఐదు మృతదేహాలు..!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలోని ఇటా ప్రాంతంలో చోటు చేసుకున్న దారుణం సంచలనంగా మారింది. సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతదేహాలు బయటపడ్డాయి. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలన్నీ ఒకే గదిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దివ్య అనే మహిళతో పాటు మరో నాలుగు మృతదేహాలు ఉండడాన్నిచూసి షాక్‌ గురయ్యారు. మృతుల్లో దివ్యతో పాటు ఆమె సోదరి బుల్‌బుల్‌, ఇద్దరు కుమారులుగా గుర్తించారు.

ఇక ఇంటిలోని రెండో అంతస్తులో దివ్య మామ రాజేశ్వర్‌ పచౌరి మృతదేహం కూడా గుర్తించారు. కాగా, దివ్య మెడపై గాయాలు ఉండగా, ఇతర మృతదేహాల వద్ద పలు మాత్రలు, పురుగుల మందు సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it