అధికార దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ
క్షేమించేది లేదని, అలాంటి అధికారులను విధుల నుంచి తప్పించాల్సిందేనని భారత ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలువాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన విలువైన భూమి ఆక్రమణలను నిరోధించలేని అధికారులపై వేటు వేయాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది.

కాగా, రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ ప్రాంతంలో దాదాపు 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి సుదీర్ఘ కాలం ఆక్రమణకు గురైనట్లు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, కనీసం కొంత మంది అధికారులపైనా అయినా వేటు వేయాలని పేర్కొంది. అంతేకాకుండా సంబంధిత అధికారులపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారో కౌంటర్‌ అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *