వేసవి సెలవులు రద్దు.. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం
By సుభాష్ Published on 29 April 2020 8:46 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తున్నట్లు హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులు రద్దు చేస్తున్నట్లు రిజిస్టార్ జనరల్ ఆదేశాలను జారీ చేసింది. అయితే హైకోర్టు జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే 4 నుంచి జూన్ 5వ తేదీ వరకూ తెలంగాణలో కోర్టులకు సెలవులు ఉంటాయి. ఇక కరోనా వైరస్ కాలరాస్తుండటంతో ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చేయాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది.
ఇది హైకోర్టు, కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు, తెలంగాణ లీగల్ సర్వీస్ అధారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమి, మీడియేన్, అర్బట్రేషన్ సెంటర్లకు ఇది వర్తించనుందని పేర్కొన్నాయి.
Next Story