రాజధాని మార్పు అంటే.. పాత‌ కారు తీసేసి కొత్త‌ కారు కొన్న‌ట్టు కాదు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Dec 2019 5:06 AM GMT
రాజధాని మార్పు అంటే.. పాత‌ కారు తీసేసి కొత్త‌ కారు కొన్న‌ట్టు కాదు.!

రాజధాని మార్పు అంటే పాత‌ కారు తీసేసి కొత్త‌ కారు కొనుక్కున్నట్టు కాదని, లేదంటే.. జగన్‌ కోరుకున్నచోట భవంతులు నిర్మించుకున్నట్టు కాదని సుజనా చౌదరి అన్నారు. ఆదివారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని మార్పునకు సీఎం జగన్ కారణాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

జీఎన్‌ రావు కమిటీ ఎందుకు వేశార‌ని.. మూడు రాజధానుల అంశం అనేది హాస్యాస్పదమన్నారు. అధికార వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి జరగదని... వెనుబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర సంస్థలు నెలకొల్పితే అభివృద్ది జ‌రుగుతుంద‌ని సుజనాచౌదరి అన్నారు.

రాజధాని నిర్మాణం విష‌యంలో ఆల‌స్యం జ‌రిగిన మాట‌ వాస్తవమేనని.. ఆ కారణంతోనే టీడీపీని ఓడించారని సుజనా అన్నారు. అమరావతిలో కేంద్రానికి చెందిన 130 సంస్థలకు భూముల కేటాయింపు జరిగిందన్నారు. రాజధానికి పలు విద్యాసంస్థలు వచ్చాయని ఆయ‌న అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలే అవుతోందని.. ఈ ఏడు నెలల్లో రాజధానిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్నారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయని విమర్శించారు. అమరావతిని స్వాగతిస్తూ 30 వేల ఎకరాలు చాలని విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌ అసెంబ్లీలో అన్నార‌ని గుర్తుచేశారు. అప్పుడు అమరావతిని ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించ లేదని అన్నారు.

Next Story