ధోనీ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 1:44 PM GMT
ధోనీ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్

భారత్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ చెప్పాడు. ఇకపై ధోనిని నీలం రంగు జెర్సీలో చూడలేమని అభిమానులు విలపిస్తూ ఉన్నారు. కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని భారత్ కు ఎన్నో విజయాలను అందించాడు. అతడి నాయకత్వాన్ని ఎంతో మంది కొనియాడారు. భారత్ వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ధోని నాయకత్వంలో అందుకోవడమే ఎంతో స్పెషల్..! అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం ధోని సొంతం.. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా కూల్ గా ఆలోచించడంతోనే సగం విజయం భారత్ కు అందించేవాడు. భారత జట్టుకు ఎంతో మంది నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ధోని ఎంతో స్పెషల్..!

ధోని లోని నాయకత్వ లక్షణాలు రాజకీయాల్లో బాగా పనికొస్తాయని అంటూ ఉంటారు. ఇదే విషయాన్ని బీజేపీ నేత రాజ్య సభ ఎంపీ డాక్టర్ సుబ్రమణియన్ స్వామి చెప్పుకొచ్చారు. ధోని 2024 లోక్ సభ జనరల్ ఎలెక్షన్స్ లో నిలబడాలని సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్ లో కోరారు.'ధోని క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్ అవుతున్నాడని, మిగతా దేని నుంచి రిటైర్ కావడంలేదని ఆయన అన్నారు. ధోని గొప్ప నాయకుడు. అతడి వంటి నాయకులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతారు. అతనికున్న సమయస్పూర్తి, అనుభవంతో సమస్యలకు చక్కటి పరిష్కారాలను అందించవచ్చు. ధోని 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలి' అని అన్నారు సుబ్రమణియన్ స్వామి. ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో ధోని భారతీయ జనతా పార్టీలో చేరుతారంటూ వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యలు ధోని రాజకీయ భవితవ్యంపై మరింత చర్చకు దారి తీసింది.

Next Story
Share it