అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 3:41 PM GMT
అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై

ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాల‌ను అందించిన‌ భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ క్రీడాభిమానుల‌కు చేదువార్త చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రకటించాడు. ఈ సంద‌ర్భంగా ధోనీ ఇన్నాళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు.

2004, డిసెంబర్‌ 23 బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అతడు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధోనీ అన‌తి కాలంలోనే ఆట‌గాడిగా రాణించి.. టీమిండియా సార‌థిగా ఎదిగాడు. దోనీ కెప్టెన్సీలో టీమిండియా వన్డే, టీ-20 ప్రపంచకప్‌లు సాధించింది. 2014లో టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలిగిన ధోనీ టీ-20 వన్డే, జట్లలో ఆటగాడిగా కొనసాగాడు. ధోని అనూహ్య నిర్ణయంతో యావత్‌ క్రీడా లోకం ఆశ్చర్యంలో మునిగింది.

ధోనీ కెరీర్‌లో 90 టెస్టులు ఆడి 144 ఇన్నింగ్స్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడగా, 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10శతకాలు, 73 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 98 టీ20 మ్యాచులాడిన ధోనీ 1617 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు అర్ద‌సెంచ‌రీలు ఉన్నాయి.

View this post on Instagram

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

Next Story