విద్యార్థుల గ్యాంగ్ వార్.. పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా సీన్‌

By అంజి  Published on  29 Feb 2020 8:03 AM GMT
విద్యార్థుల గ్యాంగ్ వార్.. పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా సీన్‌

ముఖ్యాంశాలు

  • శ్రీకాకుళం జిల్లా పాలకొండలో స్టూడెంట్‌ గ్యాంగ్‌వార్‌
  • పాలకొండ నడిరోడ్డుపై రెండు గంటల పాటు వీరంగం
  • ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా సిక్కోలులో విద్యార్థుల మధ్య గ్యాంగ్‌ వార్‌ జరిగింది. పాలకొండలో తమ్మినాయుడు కాలేజీకి చెందిన విద్యార్థులు.. వీధి రౌడీల్లా నడి రోడ్డు మీద కొట్టుకుంటూ వీరంగం సృష్టించారు. నిన్న సాయంత్రం ఓ జూనియర్‌ విద్యార్థి సీనియర్‌ విద్యార్థిని బైక్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, కొట్లాట జరిగింది. అది తెలిసి ఒకరేంజ్‌లో ఫస్టియర్‌ విద్యార్థి స్నేహితులు అటాక్‌ చేశారు. నడిరోడ్డుపై రెండు గంటల పాటు వీరంగం సృష్టించారు. లోకల్స్‌ ఎంటరై తరిమేసేదాకా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పాలకొండ మెయిన్‌ రోడ్డులో రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగానే ఉన్న స్టూడెంట్స్‌ కొట్లాడుకున్నారు. అయితే అక్కడే ఉన్న కాలేజీ యాజమాన్యం మాత్రం చోద్యం చూసింది. సోషల్‌ మీడియాలో విద్యార్థులు ఘర్షణ పడిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనపై ఆరా తీస్తున్నారు. తక్షణమే ఘటనపై చర్యలు తీసుకోవాలనీ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రస్తుతానికి ఈ ఘటనపై ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి మీడియా ప్రతినిధులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కాలేజీలో లోకల్‌, నాన్‌ లోకల్‌ గ్యాంగ్‌ వార్‌ నడుస్తున్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్న కాలేజీ యాజమాన్యం మాత్రం తాత్సారం వహిస్తోంది.

Next Story