కర్నూలు జిల్లాలోని సంజామల మండలం అక్కంపల్లెలో నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన వైసీపీ నేత శివారెడ్డి పాత ఇంటి గోడల్లో దాచి ఉంచిన బాంబులు ఒక్కసారిగా పేలాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.