ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయం

టీ20 ప్రపంచ కప్ లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయకూడదని ఊరికే చెప్పలేదు.

By -  Medi Samrat
Published on : 13 Feb 2026 2:53 PM IST

ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయం

టీ20 ప్రపంచ కప్ లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయకూడదని ఊరికే చెప్పలేదు. తాజాగా జింబాబ్వే జట్టు టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 169 పరుగులు చేయగా, ఆసీస్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. 2007 టీ20 ప్రపంచ కప్ లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. ఇప్పుడు మరోసారి సంచలన విజయాన్ని అందుకుంది.

Next Story