తండ్రైన మాజీ స్టార్ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇంట్లో నవ్వులు విరిశాయి. ఆయన భార్య సాగరిక ఘట్గే ఖాన్‌కు మగబిడ్డ జన్మించాడు.
By Medi Samrat
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇంట్లో నవ్వులు విరిశాయి. ఆయన భార్య సాగరిక ఘట్గే ఖాన్‌కు మగబిడ్డ జన్మించాడు. ఈ శుభవార్తను ఆయనే స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు తనకు పుట్టిన బిడ్డ పేరును కూడా బయటపెట్టాడు. ఈ జంట ఫోటోలను చూసిన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి అభినందనలు తెలుపుతున్నారు.
2017 సంవత్సరంలో జహీర్ ఖాన్ చక్ దే ఇండియా నటి సాగరిక ఘట్గేని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ ఒక పార్టీలో కలుసుకున్నారు. అక్కడ నుండి వారి మధ్య స్నేహం ప్రారంభమైంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. జహీర్ ఖాన్ ముస్లిం మతానికి చెందినవారు కాగా.. సాగరిక హిందూ మతానికి చెందినది.. కానీ ఇద్దరూ మతాలను గురించి పట్టించుకోకుండా జీవిత భాగస్వాములవాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత ఇద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సమాచారాన్ని ఇస్తూ సాగరిక.. ఇంటికి ఒక మగబిడ్డ వచ్చాడని.. అతని పేరు ఫతే సింగ్ ఖాన్ అని రాసింది. వైరల్ చిత్రాలలో.. సాగరిక జహీర్ ఖాన్ భుజంపై చేయి వేసి చిరునవ్వుతో కూర్చోగా.. జహీర్ కొడుకును తన ఒడిలో పట్టుకుని నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. హృదయాన్ని హత్తుకునే ఈ చిత్రాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ జంటను అభినందిస్తున్నారు.