ఈ అమ్మాయే 'చాహల్-ధనశ్రీ' మధ్య దూరానికి కారణమా.?
భారత జట్టు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీల మధ్య విడాకుల వార్తలు జోరందుకున్నాయి.
By Medi Samrat Published on 7 Jan 2025 3:57 PM ISTభారత జట్టు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీల మధ్య విడాకుల వార్తలు జోరందుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఫోటోలు కూడా డిలీట్ చేశారు. అయితే చాహల్ ఒక అమ్మాయితో తిరుగుతున్న ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటో బయటకు రావడంతో చాహల్ గురించి చర్చ తీవ్రమైంది. ఈ వీడియోలో అతడు తెల్లటి చొక్కాలో కనిపిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరనే విషయంపై క్లారిటీ లేదు కానీ.. పలు ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ అమ్మాయి విడాకులకు కారణం అని కొందరు, చాహల్ కొత్త గర్ల్ ప్రెండ్ అని కొందరు అంటున్నారు. రియాలిటీ ఏమిటో ఇంకా తెలియదు.
చాహల్, ధనశ్రీలు నాలుగేళ్లపాటు ఒకరితో ఒకరు ఉన్నారు. కోవిడ్-19 సమయంలో వారిద్దరూ ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్. కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో చాహల్ ధనశ్రీ నుండి ఆన్‌లైన్ డ్యాన్స్ క్లాసులు తీసుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ 22 డిసెంబర్ 2020న వివాహం చేసుకున్నారు. 2023 సంవత్సరం ప్రారంభంలో వారి విడాకుల గురించి వార్తలు వచ్చాయి.. కానీ అవి పుకార్లు అని తేలింది. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ సోషల్ మీడియాలో హఠాత్తుగా ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతోపాటు కలిసి దిగిన ఫొటోలను కూడా తొలగించారు. ఆ తర్వాత వీరి విడాకుల వార్తలు జోరందుకున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఇద్దరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. విడాకుల వార్తలు వచ్చిన తర్వాత.. చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పోస్ట్ చేశాడు, అందులో అతడు తన బాధను వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం చాహల్‌కు కాలం సరిగా లేదు. అతడికి జట్టులో స్థానం కూడా లేదు. తన స్పిన్‌తో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను సైతం మట్టికరిపించిన చాహల్.. పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. సఫలం కావడం లేదు. తాజాగా ఐపీఎల్ వేలంలో మాత్రం భారీ ధరకు అమ్ముడుపోయాడు. IPL-2025 మెగా వేలంలో చాహల్‌ను పంజాబ్ కింగ్స్ 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అది చాహల్ కు ఊరటనిచ్చే అంశం.