స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చిన చ‌హ‌ల్‌.. చెప్ప‌కుండానే పెళ్లి చేసుకున్నాడు

Yuzvendra Chahal marries Dhanashree Verma. టీమ్ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్ ఓ ఇంటివాడయ్యాడు. యూట్యూబర్,

By Medi Samrat  Published on  23 Dec 2020 10:29 AM IST
స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చిన చ‌హ‌ల్‌.. చెప్ప‌కుండానే పెళ్లి చేసుకున్నాడు

టీమ్ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్ ఓ ఇంటివాడయ్యాడు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గురుగ్రామ్‌లో వీరి వివాహం జరిగింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించడంతో పాటు ఫోటోలు పంచుకున్నాడు. 'గతంలో మా పరిచయం ఏర్పడింది, మేం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం. ఇద్దరం ఒకటయ్యాం' అని దానికి కాప్షన్ జత చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. చ‌హ‌ల్ కు క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో క్రిస్‌ గేల్, కర్ణ్‌ శర్మ, రోహిత్ శర్మ భార్య రితికా తదితరులు ఉన్నారు. కాగా, చహల్, ధనశ్రీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇప్పటికే పలు దేశాలు చుట్టేశారు. యూట్యూబ్ లో ధనశ్రీ డ్యాన్స్ వీడియోలు చూసి లవ్‌లో పడిపోయాడు ఈ లెగ్‌స్పిన్న‌ర్‌. ఆగస్టులోనే వీరికి రోకా వేడుక జరిగింది.. ఆ సమయంలో తన ప్రపోజల్ గురించి చహల్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవ‌లే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ముగించుకుని స్వ‌దేశానికి వ‌చ్చిన చహ‌ల్ వెంట‌నే పెళ్లి చేసుకున్నాడు. భార‌త వ‌న్డే, టీ20 జ‌ట్ల‌లో చ‌హ‌ల్ రెగ్యుల‌ర్ స‌భ్యుడు కాగా.. టెస్టుల్లో అవ‌కాశం ద‌క్క‌డం లేదు.




Next Story