భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ మధ్య అంతా సరిగా ఉన్నట్లు కనిపిచడం లేదు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే దానిపై అధికారిక సమాచారం రాలేదు. ఇటీవల ధనశ్రీ ఫోస్టుపై చాలా దుమారం చెలరేగింది. యుజ్వేంద్ర చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ధనశ్రీ ఫోటోలను తొలగించాడు. దీని తర్వాత విడాకుల వార్త వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ఇరువురు ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.
కొన్ని నెలల క్రితం ధనశ్రీ తన స్నేహితుడు ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరూ చాలా దగ్గరగా కనిపించారు. ఈ ఫోటోకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా పోస్టులు షేర్ అవుతున్నాయి. చాహల్-ధనశ్రీ విడాకుల వార్త తర్వాత కొరియోగ్రాఫర్ ప్రతీక్ మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ధనశ్రీ, ప్రతీక్‌ల ఫోటో బయటకు వచ్చిన తర్వాత చాహల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రతీక్ కొరియోగ్రాఫర్ కాగా.. ధనశ్రీకి ఎప్పటినుంచో స్నేహితుడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే విడాకుల విషయంలో యుజ్వేంద్ర చాహల్ లేదా ధనశ్రీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వీరు విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయమై తీవ్ర చర్చ నడుస్తోంది.