నాకు మేనేజ్‌మెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో మహీ భాయ్ కెప్టెన్ అయ్యాడు: యువీ
Yuvraj Singh narrates how he missed Team India’s captaincy. యువరాజ్ సింగ్.. గంగూలీ తర్వాత టీమిండియాకు యువరాజ్ సింగ్ కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు
By Medi Samrat Published on 8 May 2022 10:11 AM GMTయువరాజ్ సింగ్.. గంగూలీ తర్వాత టీమిండియాకు యువరాజ్ సింగ్ కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో యువరాజ్ ను పక్కన పెట్టేశారు. ఇతర ఆటగాళ్లను కెప్టెన్లుగా పరీక్షించినా చివరికి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. ఇక ధోని కెప్టెన్ అయ్యాక భారత క్రికెట్ లో ఎలాంటి అనూహ్య మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! అయితే యువరాజ్ ను ఎందుకు పక్కన పెట్టారు అనే విషయమై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది.
తాజాగా యువరాజ్ సింగ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. గ్రెగ్ చాపెల్ ఉదంతం నన్ను టీమిండియా కెప్టెన్సీ నుంచి దూరం చేసిందని తెలిపాడు. చాపెల్ 2005 నుంచి 2007 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో అతను తీసుకున్న కొన్న నిర్ణయాలపై జట్టులో అప్పటికే సీనియర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తప్పుబట్టారు. 2007 వరల్డ్‌కప్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డ్‌ర్‌ను మార్చేయడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసిందని తెలిపాడు యువీ. ఇక చాపెల్ ఉదంతం నన్ను కెప్టెన్సీకి దూరం చేసిందని తెలిపాడు. 2007లో ఇంగ్లండ్ టూర్‌కు సెహ్వాగ్ అందుబాటులో లేడు. దీంతో ద్రవిడ్ కెప్టెన్‌గా.. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాం. ఆ తర్వాత జట్టులోని సీనియర్లకు, చాపెల్‌కు విబేధాలు వచ్చినప్పుడు, మా టీమ్‌ను సపోర్ట్ చేయడం కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు.
ఒక దశలో నేను తప్ప ఎవరు కెప్టెన్‌గా ఉన్నా మాకు అభ్యంతరం లేదని కొందరు అధికారులు చెప్పారు.. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికి పరోక్షంగా కొందరు నాపై పగబట్టడంతో కెప్టెన్ అవ్వలేకపోయానని తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్‌కు నేను కెప్టెన్ అవ్వాల్సింది. మేనేజ్‌మెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయ్యాడు. తొలిసారే టైటిల్ గెలవడం జరిగిపోయాయి. ధోనిని నేను తప్పుబట్టలేను. మేనేజ్‌మెంట్ నిర్ణయం ప్రకారం ధోని కెప్టెన్ అయ్యాడు.. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతని కెప్టెన్సీలో ఆడడం నేను చేసుకున్న అదృష్టమని యువరాజ్ తెలిపాడు.