అభిషేక్‌ను లేట్ నైట్ పార్టీలకు వెళ్ల‌కుండా, గర్ల్ ఫ్రెండ్‌ను కలవకుండా యువీ అడ్డుకున్నాడు..!

అభిషేక్ శర్మ.. టీ20లో భారత కొత్త స్టార్‌గా వెలుగొందిన‌ ఆట‌గాడు. అతి తక్కువ సమయంలోనే అతడు టీమిండియా పవర్ హిట్టర్‌గా పేరు పొందాడు

By Medi Samrat
Published on : 22 April 2025 4:45 PM IST

అభిషేక్‌ను లేట్ నైట్ పార్టీలకు వెళ్ల‌కుండా, గర్ల్ ఫ్రెండ్‌ను కలవకుండా యువీ అడ్డుకున్నాడు..!

అభిషేక్ శర్మ.. టీ20లో భారత కొత్త స్టార్‌గా వెలుగొందిన‌ ఆట‌గాడు. అతి తక్కువ సమయంలోనే అతడు టీమిండియా పవర్ హిట్టర్‌గా పేరు పొందాడు. అభిషేక్ శర్మ 2024 IPLలో బలమైన ప్రదర్శన చేయడం ద్వారా భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఒక సంవత్సరంలోనే అతడు బ్యాటింగ్ ద్వారా ప్రత్యేక ముద్రను వేయ‌డం ద్వారా విజయం సాధించాడు. తాజాగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. అతని విజయం వెనుక భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. అతను తుఫాను ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారీ యువరాజ్ సింగ్‌కు క్రెడిట్ ఇచ్చాడు.

కాగా.. యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అభిషేక్ శర్మ జీవితాన్ని మెరుగుపరచడంలో తన కొడుకు గురించి ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. అభిషేక్ శర్మను మెరుగుపరచడంలో త‌న‌ కుమారుడు యువరాజ్ సింగ్ ముఖ్యమైన సహకారాన్ని యోగరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

యువీ నాకు అభిషేక్ రికార్డు పంపి పాపా, ఈ ఆటగాడిని చూడు అన్నాడు. నేను చెప్పాను, చూడండి, ఇదంతా సమాచారాన్ని పంచుకోవడం గురించి. ఇదే సమస్య, కొంతమంది ఆటగాడి కెరీర్‌ను నిర్మించడానికి బదులు అసూయతో అతనిని తొలగించాలనుకుంటున్నారు.

అభిషేక్ శర్మ తండ్రి అతన్ని మెరుగుపరచడానికి చాలా ప్రయత్నించేవారని.. కానీ యువరాజ్ తన జీవితాన్ని మెరుగుపరిచాడని యోగరాజ్ చెప్పాడు. యువరాజ్.. అభిషేక్ లేట్ నైట్ పార్టీలు.. అతని స్నేహితురాలిని కలవకుండా అడ్డుకున్నాడు.

“లేట్ నైట్ పార్టీలు.. గర్ల్ ఫ్రెండ్స్.. తర్వాత ఏమైంది.. ఇదంతా చేయవద్దని యువరాజ్ చెప్పాడు.. యువీ ఎక్కడున్నావ్ అని అరిచేవాడు. 9 గంటలైంది, నేరుగా పడుకో అని అభిషేక్‌పై తను అరవడం చూశాను. నా ఉద్దేశ్యం నీకు అర్థమైందా.. లేక నేను రావాలా?" అని గ‌ద్దించేవాడు. యువరాజ్‌కు భయపడి అభిషేక్ వెంటనే అతని గదిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోయేవాడు. ఆ త‌ర్వాత‌ యువీ నాకు ఉదయం 5 గంటలకు నిద్రలేపమని చెప్పేవాడని పేర్కొన్నాడు.

యువరాజ్ సింగ్ శుభ్‌మన్ గిల్‌ను కూడా అదే విధంగా ట్రీట్ చేశాడ‌ని యోగరాజ్ చెప్పారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఇద్దరూ 2018లో అండర్-19 ప్రపంచకప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. శుభమాన్ గిల్ విషయంలో కూడా అదే జరిగిందని యోగరాజ్ చెప్పారు. ఏం జరిగింది? ఒక వజ్రం మరో వజ్రం చేతిలోకి వస్తే ఏమవుతుంది కోహినూర్ అవుతాడు.. అభిషేక్ శర్మ విషయంలో కూడా అదే జరిగింది. ఈ వజ్రం తప్పుడు చేతుల్లోకి వెళ్లి ఉంటే, అది విరిగిపోయి పగిలిపోయేదని పేర్కొన్నారు.

Next Story