Young Boy Can Play Every Shot In The Book With Just One Stump. చాలా మంది చిన్న వయసులో క్రికెటర్లు అయిపోదామనే కలలు కంటూ
By Medi Samrat Published on 8 May 2021 1:18 PM GMT
చాలా మంది చిన్న వయసులో క్రికెటర్లు అయిపోదామనే కలలు కంటూ ఉంటుంటారు. ఆ కలలను సాకారం చేసుకునే వారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటారు. క్రికెటర్ అవ్వాలని అనుకుంటే సరిపోదు.. అందుకు కఠోర శ్రమ కూడా చాలా ముఖ్యం. చిన్న వయసులోనే టెక్నిక్ ను సొంతం చేసుకుంటే ఇక క్రికెటర్ గా ఎదగడం కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు. తాజాగా ఓ పిల్లడు షాట్స్ చూడముచ్చటగా ఉన్నాయి. అయితే అతడు బ్యాట్ తో ఆడుతున్నాడు అని అనుకుంటే పొరపాటే.. వికెట్స్ గా పెట్టే స్టంప్ తో అతడు దుమ్ము లేపుతూ ఉన్నాడు.
— The Grade Cricketer (@gradecricketer) May 8, 2021
కవర్ డ్రైవ్, లెగ్ గ్లాన్స్ దగ్గర నుండి స్కూప్ షాట్ వరకూ ఆ పిల్లాడు ఎంతో అద్భుతంగా ఆడాడు. ఎంతో ఫుట్ వర్క్ తో ఆ పిల్లాడు ఆడిన షాట్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రతి ఒక్క డెలివరీని ఆ పిల్లాడు స్టంప్ కు మిడిల్ చేయడం.. అద్భుతమైన సౌండ్ కూడా వస్తుండడంతో అతడి బ్యాటింగ్ లో సత్తా ఎంత ఉందో మనం గమనించవచ్చు. అతడిలో అద్భుతమైన ట్యాలెంట్ ఉందని పలువురు మెచ్చుకున్నారు. స్టంప్ తోనే ఇంత రచ్చ చేస్తూ ఉన్నాడంటే.. ఇక బ్యాట్ తో అదరగొట్టేస్తాడు కదా అని.. పలువురు మెచ్చుకున్నారు. ఆ పిల్లాడి మేనేజర్ అవ్వాలని అనుకుంటూ ఉన్నా అని కూడా కొందరు కామెంట్ చేశారు. రాబోయే కాలానికి.. కాబోయే స్టార్ అంటూ మెచ్చుకున్నారు. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి..