అంపైర్ ఉద్యోగం అనేక సవాళ్లతో కూడి ఉంటుంది. క్రికెట్ లో కాస్త వెరైటీగా అంపైరింగ్ చేసే వాళ్లకు వచ్చే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఓ అంపైర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో స్థానిక క్రికెట్ టోర్నమెంట్ అయిన పురందర్ ప్రీమియర్ లీగ్‌లో అంపైర్ ఇచ్చిన సిగ్నల్స్ సూపర్ అని అంటున్నారు. వైడ్ బాల్‌కు సంకేతం ఇవ్వడానికి అంపైర్ యోగా భంగిమను తీసుకుని మ్యాచ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
వైడ్ బాల్‌ను సిగ్నల్ చేయడానికి, ఆ వ్యక్తి కెమెరాకు దగ్గరగా వచ్చి తలక్రిందులుగా నిలిచీ కాళ్ళను పైకి లేపి మరీ ఇచ్చాడు. సిగ్నల్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అంపైర్ చర్యతో వ్యాఖ్యాత కూడా షాక్ అయ్యాడు. "అంపైర్ మా దగ్గరికి వస్తున్నాడు. అతను ఏమి చేసాడు? తనదైన స్టైల్‌లో అద్భుతంగా చూపిస్తున్నాడు' అని వ్యాఖ్యాత చెప్పడం వీడియోలో వినపడింది.
ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో ఈ క్లిప్‌ను పంచుకున్నారు. "యోగా మరియు క్రికెట్ కలిసినప్పుడు" అని సాహు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. డిసెంబర్ 5న క్రికెట్ అభిమాని సారంగ్ భలేరావ్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ మరియు 2,000 లైక్‌లను పొందింది.ఆ అంపైర్ పేరు DN రాక్ అని తెలిపారు. క్రికెట్ అభిమానులకు ఆయన శైలి తెగ నచ్చేస్తోంది.