బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టాడు. జైస్వాల్ కంటే ముందు ఇలా తమ తొలి ఆసీస్ పర్యటనలో ఎంఎల్ జైసింహా (బ్రిస్బెన్), సునీల్ గవాస్కర్ (బ్రిస్బెన్) సెంచరీలు బాదారు. ఈ ముగ్గురూ రెండో ఇన్నింగ్స్‌లోనే శతకాలు నమోదు చేశారు. 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు యశస్వి సిక్సర్ కొట్టి సెంచరీ నమోదు చేశాడు జైస్వాల్. 2014-15లో సిడ్నీలో కేఎల్ రాహుల్ తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ చేసిన ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
పెర్త్ టెస్ట్ మూడవ రోజు ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 172/0 వద్ద ఓపెనర్లు బ్యాటింగ్ ఆరంభించారు. ఆట మొదలైన కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. వ్యక్తిగత స్కోరు 77 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిగిగాడు. దీంతో 201 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది