టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించిన యశస్వీ
భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో సాటిలేని ఘనత సాధించాడు.
By - Medi Samrat |
భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో సాటిలేని ఘనత సాధించాడు. ఇప్పటివరకు అతడు 28 మైదానాల్లో 28 మ్యాచ్‌లు ఆడాడు. అరంగేట్రం నుంచి ఇటీవలి మ్యాచ్‌ల వరకు అన్ని చోట్లా జైస్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అదే సమయంలో వివిధ మైదానాల్లో 28 టెస్టు మ్యాచ్‌లు ఆడి అద్వితీయమైన చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా ఇలా ఆడలేదు.
యశస్వి జైస్వాల్ తన తొలి టెస్టులో వెస్టిండీస్‌పై 171 పరుగులు చేశాడు. అదే సిరీస్‌లో హాఫ్ సెంచరీని కూడా చేశాడు. దీని తర్వాత అతడు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనలో విదేశీ పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ, ఇంగ్లండ్‌లో రెండు సెంచరీలు సాధించాడు. 2024లో ఇంగ్లండ్‌తో భారత్‌లో జరిగిన మ్యాచ్‌లో అతడు రెండు డబుల్ సెంచరీలు సాధించడంతో భారత్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇప్పటివరకు జైస్వాల్ 28 టెస్టుల్లో 2,440 పరుగులు చేశాడు, అతని సగటు 50 కంటే ఎక్కువ, ఇందులో 7 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 214. యశస్వి జైస్వాల్ తన 28 టెస్టుల్లో ఆడిన జట్లు, వేదికలను పరిశీలిద్దాం
1. విండ్సర్ పార్క్ వెస్టిండీస్
2. క్వీన్స్ పార్క్ దక్షిణాఫ్రికా
3. సూపర్‌స్పోర్ట్ పార్క్ దక్షిణాఫ్రికా
4. న్యూలాండ్ ఇంగ్లాండ్
5. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇంగ్లాండ్
6. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం ఇంగ్లాండ్
7. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇంగ్లాండ్
8. JSCA క్రికెట్ స్టేడియం ఇంగ్లాండ్
9. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం బంగ్లాదేశ్
10. ఎంఏ చిదంబరం స్టేడియం బంగ్లాదేశ్
11. గ్రీన్ పార్క్ న్యూజిలాండ్
12. ఎం చిన్నస్వామి స్టేడియం న్యూజిలాండ్
13. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం న్యూజిలాండ్
14. వాంఖడే స్టేడియం ఆస్ట్రేలియా
15. పెర్త్ స్టేడియం ఆస్ట్రేలియా
16. అడిలేడ్ ఓవల్ ఆస్ట్రేలియా
17. బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్ ఆస్ట్రేలియా
18. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆస్ట్రేలియా
19. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇంగ్లాండ్
20. హెడింగ్లీ ఇంగ్లాండ్
21. బర్మింగ్‌హామ్ ఇంగ్లాండ్
22. లార్డ్స్ ఇంగ్లాండ్
23. ఓల్డ్ ట్రాఫోర్డ్ ఇంగ్లాండ్
24. కెన్నింగ్టన్ ఓవల్ ఇంగ్లాండ్
25. అరుణ్ జైట్లీ స్టేడియం వెస్టిండీస్
26. నరేంద్ర మోడీ స్టేడియం వెస్టిండీస్
27. ఈడెన్ గార్డెన్స్ దక్షిణాఫ్రికా
28. బర్సపారా క్రికెట్ స్టేడియం దక్షిణాఫ్రికా