రాజ్ కోట్ లో రికార్డులు బద్దలుకొట్టిన జైస్వాల్

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో 3వ టెస్ట్ మ్యాచ్‌ 4వ రోజు యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు.

By Medi Samrat  Published on  18 Feb 2024 4:00 PM GMT
రాజ్ కోట్ లో రికార్డులు బద్దలుకొట్టిన జైస్వాల్

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో 3వ టెస్ట్ మ్యాచ్‌ 4వ రోజు యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. యశస్వి తన సెంచరీని కాస్తా డబుల్‌ సెంచరీగా మార్చాడు. యశస్వి జైస్వాల్ వరుస రికార్డులను బద్దలు కొట్టాడు. యువ ఓపెనర్ 214 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతనికిది వరుసగా రెండవ శతకం. అతడి ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ శనివారం సాయంత్రం వెన్నునొప్పితో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. శనివారం నాడు 91 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ రనౌట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే భారత్ భారీ లీడ్ సాధించగా.. ఇక జైస్వాల్ భారీ హిట్స్తో రెచ్చిపోయాడు. జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్ లో జైస్వాల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం ఆదివారం ఆటలోని హైలైట్‌లలో ఒకటి.

యశస్వి, సర్ఫరాజ్ ఖాన్ కలిసి 26.2 ఓవర్లలో 172 పరుగులు చేశారు.

2 - ఇంగ్లండ్‌పై టెస్టుల్లో ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు కొట్టిన తొలి భారతీయ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.

3 - విరాట్ కోహ్లీ, వినోద్ కాంబ్లీ తర్వాత వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు బాదిన 3వ భారత ఆటగాడిగా యశస్వి నిలిచాడు.

3 - వినూ మన్కడ్, విరాట్ కోహ్లీ తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన 3వ భారతీయ బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు.

12 - ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వసీం అక్రమ్ రికార్డును యశస్వి జైస్వాల్ సమం చేశాడు.

22 - పురుషుల టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. 2019లో దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ 19 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు.

Next Story