తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపిన యశ్ ధుల్

Yash Dhull smashes 113 on debut for Delhi. ఐసిసి అండర్ -19 ప్రపంచ కప్ లో భారత జట్టును విజయం వైపు నడిపించిన అండర్ -19

By Medi Samrat  Published on  17 Feb 2022 1:25 PM GMT
తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపిన యశ్ ధుల్

ఐసిసి అండర్ -19 ప్రపంచ కప్ లో భారత జట్టును విజయం వైపు నడిపించిన అండర్ -19 కెప్టెన్ యష్ ధుల్ రంజీ టోర్నమెంట్ లో మరో అద్భుతమైన ఆరంభానికి నాంది పలికాడు. టోర్నమెంట్‌లో భాగంగా మొదటి రోజు గురువారం నాడు ఢిల్లీ తరపున సెంచరీతో రంజీ కెరీర్‌ను ప్రారంభించాడు. తమిళనాడుపై 18 బౌండరీల సహాయంతో ధుల్ కేవలం 150 బంతుల్లో 113 పరుగులు చేశాడు. తమిళనాడు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ని ఎంచుకున్న తర్వాత, ఢిల్లీకి ఓపెనర్ గా యశ్ ధుల్‌ వచ్చాడు.

సెంచరీ మార్కును చేరుకోవడానికి అతను కేవలం 133 బంతుల్లోనే తీసుకున్నాడు. ధుల్ ఢిల్లీని తన ఇన్నింగ్స్ ద్వారా ఆదుకున్నాడు. నితీష్ రాణాతో కలిసి 3వ వికెట్‌కు కీలకమైన 60 పరుగులు జోడించాడు. ధుల్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్‌లో ఉన్న సమయంలో M మహమ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు, అయితే బంతి నో-బాల్‌గా చెప్పారు. మరో అవకాశం వచ్చిన తర్వాత సెంచరీతో కదం తొక్కాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో మరో బ్యాట్స్మెన్ జాంటీ సింధు 71 పరుగులు చేశాడు.


Next Story
Share it