ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా అన్నయ్య కృనాల్ పాండ్యా వ్యవహరిస్తూ ఉన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడంతో లక్నో సూపర్ జెయింట్స్ కు కృనాల్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు. అన్నదమ్ములు ఇలా వేర్వేరు జట్లకు కెప్టెన్సీ వహించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం. టాస్ గెలిచిన కృనాల్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మొదటి ఓవర్ నుండి సాహా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సిక్సర్ బాది హాఫ్ సెంచరీని సాధించాడు. మరో ఓపెనర్ గిల్ కాస్త నిదానంగా ఆడుతూ ఉన్నా.. సాహా మాత్రం విజృంభించి ఆడాడు.