డ‌బ్ల్యూపీఎల్‌ వేలం : భారీ ధరకు మంథానను ధ‌క్కించుకున్న ఆర్సీబీ

Women Premier League Auction. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం 2023 అట్టహాసంగా మొదలైంది.

By Medi Samrat  Published on  13 Feb 2023 1:00 PM GMT
డ‌బ్ల్యూపీఎల్‌ వేలం : భారీ ధరకు మంథానను ధ‌క్కించుకున్న ఆర్సీబీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం 2023 అట్టహాసంగా మొదలైంది. చాలా మంది టాప్ ప్లేయర్‌లను ఇప్పటికే ఐదు జట్లు కొనుగోలు చేశాయి. ఇప్పటివరకు, భారత స్టార్ స్మృతి మంధాన అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్ జెయింట్స్ 3.2 కోట్లకు, ఇంగ్లండ్‌కు చెందిన నాట్ స్కివర్-బ్రంట్ ముంబై ఇండియన్స్ అదే మొత్తానికి కొనుక్కుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 1.80 కోట్లకు ముంబై ఇండియన్స్‌కు వెళ్లగా, దీప్తి శర్మ 2.60 కోట్లకు UP వారియర్స్ కు వెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుండి షఫాలీ వర్మ 2 కోట్లు అందుకోనుంది. అదే జట్టు కు జెమిమా రోడ్రిగ్స్ ఆడనుంది. ఆమెకు వేలంపాటలో రూ.2.2 కోట్లు దక్కనున్నాయి.

వేలంలో పాల్గొనే 409 మంది ప్లేయర్లలో 246 మంది స్వదేశీ ప్లేయర్లు ఉన్నారు, 163 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వేలానికి ఐదు టీమ్ (ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, ఢిల్లీ) లకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ సెక్రటరీ జై షా లు డబ్ల్యూపీఎల్ లోగోను విడుదల చేశారు.


Next Story