టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. కన్నకూతురు ఐరా (10) చదువును పూర్తిగా గాలికొదిలేసి, ప్రియురాలి పిల్లల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాడని విమర్శించారు. షమీ తన ప్రియురాలి పిల్లలను ఖరీదైన పాఠశాలల్లో చదివిస్తున్నాడని, వారి కోసం బిజినెస్ క్లాస్ విమాన టికెట్లకు లక్షలు ఖర్చు చేస్తున్నాడని హసీన్ జహాన్ ఆరోపించారు. నా కూతురి తండ్రి కోటీశ్వరుడు, కానీ, ఓ స్త్రీలోలుడిగా మారిపోయాడన్నారు.
తన కూతురు ఐరా ఇటీవల ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పాఠశాలలో చేరినట్లు కూడా జహాన్ తెలిపారు. నా కూతురు మంచి పాఠశాలలో చేరకుండా శత్రువులు ఎన్నో కుట్రలు చేశారన్నారు. చట్టపరంగా షమీ నుంచి హసీన్ జహాన్‌కు నెలకు రూ. 4 లక్షల భరణం అందుతోంది. ఇందులో రూ. 2.5 లక్షలు కూతురు ఐరా బాగోగుల కోసమే కేటాయించారు. షమీ, జహాన్‌ల వివాహం 2014లో జరగ్గా, 2015లో వారికి ఐరా జన్మించింది.