రెండో టీ20లోనైనా రోహిత్‌ను ఆడిస్తారా..?
Will Virat Kohli bring Rohit Sharma back in Indian XI for 2nd T20?.తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘోర పరాభవం చవిచూసిన
By తోట వంశీ కుమార్ Published on 14 March 2021 11:00 AM ISTతొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘోర పరాభవం చవిచూసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లీతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశ పరిచారు. మ్యాచ్‌కు ముందు వరకు రోహిత్ శర్మ, రాహుల్ లు ఓపెనర్లు అని కోహ్లీ ప్రకటించాడు. అయితే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు. పిచ్ ను అంచనా వేయడంతో తడబడ్డారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి భారీ మూల్యం చెల్లించుకున్నారు. మరీ ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌లోనైనా తప్పులు సరిద్దిద్దుకుని భారత జట్టు విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
తొలి మ్యాచ్ ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. అటు ఇంగ్లాండ్ జట్టు కూడా తమ జోరును కొనసాగించి ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఎలాంటి కారణం లేకుండా సరిగ్గా మ్యాచ్‌కు ముందు విశ్రాంతి అంటూ రోహిత్‌ను పక్కన కూర్చోపెట్టడంలో అర్థం లేదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు మాజీలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని ఆడిస్తుందో లేదో చూడాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్, కోహ్లీ, శిఖర్ ధావన్ ల నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది మేనేజ్ మెంట్. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలుకావడంతో ఈ మ్యాచ్ తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.