ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడలేదు

By -  Medi Samrat
Published on : 4 April 2026 5:20 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడలేదు. అనారోగ్య కారణాల వల్ల హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యాకు ఒంట్లో బాగోలేదు, మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్‌తో లేడు. అందుకే ఈరోజు అతని స్థానంలో నేను కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటున్నానని తెలిపాడు.

హార్దిక్ లేకపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టులో కొన్ని మార్పులు చేసింది. హార్దిక్ స్థానంలో దీపక్ చాహర్ జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో ఆడిన ట్రెంట్ బౌల్ట్ మరియు అల్లా గజన్‌ఫర్ స్థానంలో కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్‌లను జట్టులోకి తీసుకున్నారు. ఇది కేవలం వ్యూహాత్మక మార్పు మాత్రమేనని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

Next Story