వేలంలో మ‌ళ్లీ మెరిసిన‌ మల్లిక.. ఆమె ఆస్తుల‌ విలువ ఎంతంటే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు సంబంధించి రెండు రోజుల వేలం జెడ్డాలో జరుగుతోంది.

By Medi Samrat  Published on  25 Nov 2024 10:01 AM IST
వేలంలో మ‌ళ్లీ మెరిసిన‌ మల్లిక.. ఆమె ఆస్తుల‌ విలువ ఎంతంటే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు సంబంధించి రెండు రోజుల వేలం జెడ్డాలో జరుగుతోంది. మొదటి రోజు అంటే ఆదివారం నాడు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. మొత్తం రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రాంఛైజీలు 4 RTMలు కూడా ఉపయోగించారు.

ఈ మెగా వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను ఇచ్చారు. వీరిలో 577 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఈ ఎంపిక చేసిన ఆటగాళ్లపై బిడ్డింగ్ జరుగుతుంది. మల్లికా సాగర్ ఈసారి కూడా ఐపీఎల్ వేలాన్ని నిర్వహిస్తుంది. దీనికి ముందు.. మల్లికా సాగర్ కూడా 2024 IPL వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

మల్లికా సాగర్ కళారంగంలో సుపరిచితమైన వ్యక్తి. ఆమె అనేక కళారూపాల వేలంపాటలు నిర్వహించింది. దుబాయ్‌లో జరిగిన చివరి ఐపీఎల్ వేలాన్ని కూడా మల్లికా సాగర్ నిర్వహించింది. ఈసారి కూడా మెగా వేలంలో మల్లికా సాగర్ ఆటగాళ్ల వేలం పాట‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించింది.

మల్లికా ముంబైలోని వ్యాపార కుటుంబంలో జన్మించింది. మల్లికా USAలోని ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కాలేజీ నుండి ఆర్ట్ హిస్టరీని అభ్యసించారు. ఆమె 2001 సంవత్సరంలో తన వృత్తిని ప్రారంభించింది. మల్లికా సాగర్ 26 ఏళ్లకే వేలం ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అమెరికా నుంచి తిరిగొచ్చాక ముంబైలో ఉంటోంది. ఇండియా ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తనదైన ముద్ర వేసింది. మల్లికా సాగర్ ఆమె నికర ఆస్తుల‌ విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు. మల్లికా సాగర్ ప్రో కబడ్డీ లీగ్‌లో స్పోర్ట్స్ వేలం కర్తగా అరంగేట్రం చేసింది. PKL ఎనిమిదో సీజన్‌లో మల్లికా సాగర్ వేలంపాటలో నిలిచింది. దీంతో ఆమె క్రిస్టీస్ మొదటి భారతీయ వేలం క‌ర్త‌గా మారింది. మల్లికకు ఈ రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉంది.

Next Story