డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల కానున్న 'టెస్ట్'

నయనతార, మాధవన్, సిద్ధార్థ్ నటించిన ప్రాజెక్ట్ 'టెస్ట్'. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

By Medi Samrat
Published on : 3 April 2025 2:15 PM IST

డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల కానున్న టెస్ట్

నయనతార, మాధవన్, సిద్ధార్థ్ నటించిన ప్రాజెక్ట్ 'టెస్ట్'. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ రాత్రి నుండి OTTలో నయనతార నటించిన 'టెస్ట్‌'ని ఆస్వాదించవచ్చు. డైరెక్ట్ OTT విడుదల ప్రకటనతో చిత్ర నిర్మాతలు అందరినీ ఆశ్చర్యపరిచారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

ఒక జాతీయ స్థాయి క్రికెటర్, ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త, ఉపాధ్యాయురాలికి సంబంధించిన కథను ఈ సినిమాలో చూడొచ్చు. వారి ప్రయాణాలు క్రికెట్ మైదానంలోనూ, మైదానం వెలుపల కనెక్ట్ అవుతాయి. వారి భవిష్యత్తు ఎలా మారబోతోందని ఈ సినిమా చూపెడుతుంది. మీరా జాస్మిన్ కూడా ఈ చిత్రంలో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 4 నుండి టెస్ట్ ప్రసారం కానుంది.

Next Story