భారత్-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే..?

What Happens If India Vs Zimbabwe Match Gets Abandoned Due To Rain. టీ20 ప్రపంచ కప్ 2022 గ్రూప్ 2 నుండి సెమీ-ఫైనల్ కు వెళ్ళడానికి భారత్ తహతహలాడుతూ ఉంది.

By Medi Samrat  Published on  5 Nov 2022 12:00 PM GMT
భారత్-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే..?

టీ20 ప్రపంచ కప్ 2022 గ్రూప్ 2 నుండి సెమీ-ఫైనల్ కు వెళ్ళడానికి భారత్ తహతహలాడుతూ ఉంది. బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత క్రికెట్ జట్టు.. తర్వాతి మ్యాచ్ లో జింబాబ్వేతో తలపడనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలకు కూడా అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాపై పాక్ విజయం సెమీ-ఫైనల్ రేసులో నిలిచింది. ఇక భారత్ తమ చివరి సూపర్ 12 మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిస్తే, గ్రూప్ విజేత స్థానం ఖాయం. కానీ, మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పరిస్థితి ఏమిటన్నది తెలుసుకుందాం.

ఈ ఏడాది T20 ప్రపంచకప్‌లో వర్షం చాలా జట్లకు విలన్‌గా నిలిచింది. అనేక మ్యాచ్‌లకు అంతరాయంగా నిలవడమే కాకుండా.. పలు మ్యాచ్ లు వాష్ అవుట్ అయ్యాయి. భారత్ ప్రస్తుతం 6 పాయింట్లతో నం. 1స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా (5 పాయింట్లు), పాకిస్థాన్ (4 పాయింట్లు) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. జింబాబ్వేతో భారత్ మ్యాచ్‌లో 5 ఓవర్ల పోటీ కూడా జరగకపోతే, రెండు జట్లు ఒక పాయింట్ పంచుకుంటాయి. అలా చేస్తే భారత్‌ పాయింట్లు 7కి చేరుతాయి. దీంతో భారత్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది, కానీ గ్రూప్ విజేతగా మాత్రం నిలవలేదు. మెరుగైన నెట్ రన్ రేట్ తో నెదర్లాండ్స్‌ను ఓడించడం ద్వారా దక్షిణాఫ్రికా గ్రూప్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. T20 ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్‌లలో దేనికీ రిజర్వ్ డే లేదు. సెమీ-ఫైనల్, ఫైనల్ లకు మాత్రమే వర్షం విషయంలో రిజర్వ్ డే ఉంది.


Next Story
Share it