టీ20 ప్రపంచ కప్ లో భారత అభిమానుల ఆశలన్నీ విండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ మీదే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో విండీస్ తక్కువ పరుగులకే పరిమితమవుతుందని ఊహించగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒకానొక దశలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ కు ఆఖర్లో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ మంచి భాగస్వామ్యాన్ని అందించారు. హోల్డర్ 49 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, షెపర్డ్ హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ అందించిన 89 పరుగుల భాగస్వామ్యం విండీస్ కు పోరాడే స్కోరును అందించింది.