మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుంది అనుకుంటున్నారా..?
West Indies vs India Second T20I to start two hours late. టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు జరగనున్న రెండో టీ20 మ్యాచ్
By Medi Samrat Published on 1 Aug 2022 7:54 PM ISTటీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు జరగనున్న రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. టీమిండియా, వెస్టిండీస్ తమ తొలి టీ20 మ్యాచ్ ను ట్రినిడాడ్ లో ఆడాయి. రెండో మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న సెయింట్ కిట్స్ కు ఆటగాళ్ల లగేజీ, క్రికెట్ సరంజామా చేరుకోవడంలో ఆలస్యమైంది. కిట్లు రాకపోవడంతో మ్యాచ్ ను నిర్దేశిత సమయానికి ప్రారంభించలేకపోతున్నట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, కిట్లు అందకపోవడంతో రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో శుక్రవారం 68 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. స్టాండ్-ఇన్ కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలో ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో భారత్ విజయాన్ని అందుకుంది. ODI సిరీస్‌ను 3-0తో సిరీస్ గెలుచుకున్నారు.
ఇక రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవ్వడంపై వెస్టిండీస్ బోర్డు స్పందిస్తూ.. ఎంతో విలువైన అభిమానులు, స్పాన్సర్లు, ప్రసార భాగస్వాములు, ఇతర భాగస్వాములు అసౌకర్యానికి మన్నించాలని కోరింది. ఆటగాళ్ల లగేజి తరలింపు తమ పరిధిలో లేని విషయం అని పేర్కొంది. అసలే విండీస్ లో సిరీస్ లు అంటే ఎంతో ఆలస్యంగా ప్రారంభమవుతూ ఉంటాయి మ్యాచ్ లు.. ఇక ఈ మ్యాచ్ ఇంకా రెండు గంటలు ఆలస్యంగా మొదలవుతూ ఉండడం క్రికెట్ ప్రేమికులు కాస్త ఇబ్బంది పెట్టడమే..!