టీ20 క్రికెట్‌కు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత.. వారి భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత మాజీ బ్యాట్స్‌మెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ వారి భవిష్యత్తు గురించి పెద్ద ప్రకటన చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పుడు వన్డే, టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజాల గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'విరాట్, రోహిత్, రవీంద్ర జడేజా భారత క్రికెట్ పురోగతికి ఎంతో తోడ్పడ్డారు. వారు ఆట ఆడిన తీరు యువ ఆటగాళ్లకు ఉదాహరణ. వారి అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. వారు టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకోవడంతో చాలా కాలం పాటు ఇతర ఫార్మాట్లలో ఆడి దేశానికి కీర్తిని తెస్తారనే నమ్మకం ఉంది. ముగ్గురు ఆటగాళ్లు టెస్టు, వన్డే క్రికెట్‌కు మరింత సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విజయం గురించి ఆయన మాట్లాడుతూ.. 'దక్షిణాఫ్రికాపై ఎలాంటి పరిస్థితుల్లో గెలిచిందో టీమిండియా లక్షణాన్ని తెలియజేస్తుంది. ఆత్మవిశ్వాసం కారణంగా దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుందన్నారు.