విశాఖలో క్రికెట్ బెట్టింగ్ దందా.. ఇద్దరు అరెస్టు

విశాఖపట్నం నగర పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌లో భాగమైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 22 May 2025 1:48 PM IST

విశాఖలో క్రికెట్ బెట్టింగ్ దందా.. ఇద్దరు అరెస్టు

విశాఖపట్నం నగర పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌లో భాగమైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన గండి గణేష్, పల్లి రామకృష్ణ అలియాస్ హరీష్‌లను సైబర్ క్రైమ్ పోలీసు విభాగం అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా ఇద్దరు అనుమానితులు అధికారుల నుండి తప్పించుకున్నారు. ఆపరేషన్ సమయంలో పోలీసు అధికారులు అనుమానితుల నుండి రెండు స్మార్ట్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరికరాల ఫోరెన్సిక్ పరీక్షలో అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలలో వారి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. యువతను బెట్టింగ్ వైపు ఆకర్షితులను చేస్తున్నారంటూ పోలీసులు వివరించారు. అరెస్టు తర్వాత నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఇటువంటి మోసాలు ఎదురైతే www.cybercrime.gov.in లోని సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదా టోల్-ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేయడం ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. 7995095799 నంబర్‌ ద్వారా పోలీస్ కమిషనర్‌కు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

Next Story