విరాట్ కోహ్లీ వాడిన కారు.. ఈ పరిస్థితి ఏంటో..
Virat Kohli’s First Audi R8 Car. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వాడిన వస్తువులను వేలంపాట వేస్తే..
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వాడిన వస్తువులను వేలంపాట వేస్తే.. కోట్లలో పలుకుతాయి. ఎందుకంటే కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. కానీ కోహ్లీ వాడిన తొలి ఆడీ కార్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. కోహ్లీకి చెందిన ఆడీ కారు మాత్రం పోలీసు స్టేషన్ లో పడి ఉంది. ఆడి ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కోహ్లికి 'ఆడి ఆర్8 వీ10' కానుకగా వచ్చింది.
2016లో ఒక బ్రోకర్ ద్వారా సాగర్ థక్కర్ అనే వ్యక్తికి అమ్మేశాడు కోహ్లీ. తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వడం కోసం సాగర్ థక్కర్ కోహ్లి వద్ద ఆడి కారును కొనుక్కున్నాడట. రూ. 12 కోట్ల స్కామ్ లో సాగర్ పోలీసులకు పట్టుబడటంతో, అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కోహ్లీ వద్ద కొన్న ఆడీ కారును కూడా సీజ్ చేశారు. ఈ కారును తీసుకెళ్లి థానే పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇది ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దుమ్ము పట్టేసింది.
ఈ కారును గుర్తించిన ఓ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్, దీన్ని ఫోటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ' కోహ్లి వాడిన 'ఆడి ఆర్8 వీ10 కారు' పోలీస్ గ్రౌండ్‌లోనే ఉంది. ఒకరు వద్ద నుంచి మరొకరి వద్దకు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్‌లో మగ్గుతుంది. దాదాపు ఏడాది కాలంగా కారు ఇక్కడే చూస్తున్నా. ఇప్పుడు ఆ కారు ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలీదు' అని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్ చెప్పాడు.
దాదాపు ఏడాదిగా అది అక్కడే పడివుందని.. కోహ్లీ వాడిన కారు అని తెలుసుకుని అందరూ షాక్ కు గురవుతున్నారని తెలిపాడు. ఒకప్పుడు కోహ్లీ ఆ వాహనంలో ఉండి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం.. ఇప్పుడు ఆ కారు పరిస్థితికి చెందిన ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉన్నారు అభిమానులు.