'ఇప్పుడు మీరు ఏం మాట్లాడరు..' విమర్శకులకు కోహ్లీ చిన్ననాటి కోచ్ స్ట్రాంగ్ కౌంటర్..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బిగ్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
By Medi Samrat Published on 24 Feb 2025 1:08 PM IST
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బిగ్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా రెండో విజయం. ఈ మ్యాచ్‌లో 100 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత భారత్ విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయింది. గత రాత్రి, అభిమానులు వీధుల్లో క్రాకర్లు పేల్చారు.. ప్రజలు దీపావళి తరహా పండుగను జరుపుకున్నారు.
ఈ మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లి తన ఫామ్‌పై విమర్శలు ఎదుర్కొన్నాడు, అయితే అతడు కీలక పాక్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.దీంతో వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.. విమర్శకుల నోరు మూయించాడు.
2023 తర్వాత వన్డేల్లో కోహ్లికిదే తొలి సెంచరీ. గత కొన్నేళ్లుగా వన్డేల్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. అలాంటి పరిస్థితుల్లో దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి మళ్లీ గాడిలో పడ్డాడు. మ్యాచ్‌లో అతను అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు కొట్టాడు.
కింగ్ కోహ్లి ఇన్నింగ్స్ చూసి యావత్ భారత్ ప్రశంసలు కురిపిస్తోంది. కోహీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కూడా అతనిని ప్రశంసించారు. అతడు విమర్శకులకు నోళ్లకు తాళాలు వేశాడు.. ఇప్పుడు మీరు కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడరని నేను ఆశిస్తున్నాను. కోహ్లీ ఎప్పుడూ ఫామ్‌లో లేడని అంటారు.. నేను ఎప్పటినుండో చెప్పినట్లు, ఈ రోజు అతను చాలా పెద్ద మ్యాచ్ ఆటగాడు. పెద్ద మ్యాచ్‌లు వచ్చినప్పుడల్లా కోహ్లి రాణిస్తున్నాడు. ఇలా చాలా కాలంగా చేస్తున్నాడు. దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడు. అతని 51వ ODI, 82వ ఓవరాల్ సెంచరీతో పాటు, అతడు ODIలలో 14,000 పరుగులు పూర్తి చేసాడు. ఇది ఒక పెద్ద విజయం.. నేను అతని ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను.. అతడు మొత్తం దేశానికి సంతోషాన్ని అందించినందుకు నేను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.