విరాట్ కోహ్లీ తల్లి గురించి వస్తున్న వదంతులపై క్లారిటీ ఇదిగో!!
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు.
By Medi Samrat Published on 31 Jan 2024 7:34 PM ISTఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మ్యాచ్ లు ఆడకుండా ఎందుకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడనే దానిపై పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల నుండి వ్యక్తిగత కారణాలను చూపిస్తూ విరాట్ కోహ్లీ వైదొలిగినట్లు బీసీసీఐ నుండి ప్రకటన వచ్చింది. అయితే ఏమి జరిగింది అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొందరు విరాట్ కోహ్లీ తల్లి ఆరోగ్యం బాగాలేదనే వాదనతో పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే ఈ వాదనలపై కోహ్లీ కుటుంబం స్పందించింది.
విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ ఈ వదంతులను కొట్టిపారేశారు. వికాస్ తమ తల్లి గురించి వస్తున్న పుకార్లపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “అందరికీ హలో, మా అమ్మ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ వ్యాపిస్తున్నట్లు నేను గమనించాను, మా అమ్మ ఖచ్చితంగా ఫిట్ గానూ.. బాగానే ఉన్నారు. సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ, మీడియాను కూడా అభ్యర్థిస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, ”అని వికాస్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టు పెట్టారు. విరాట్ కోహ్లి లేకుండా హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. టామ్ హార్ట్లీ 7-62తో ఇంగ్లండ్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
Next Story