విరాట్ కోహ్లీ బెంగళూరు రెస్టారెంట్ కు నోటీసులు

ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యాజమాన్యంలోని బార్ అండ్ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్‌' కు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) నోటీసు జారీ చేసింది.

By Medi Samrat
Published on : 21 Dec 2024 5:44 PM IST

విరాట్ కోహ్లీ బెంగళూరు రెస్టారెంట్ కు నోటీసులు

ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యాజమాన్యంలోని బార్ అండ్ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్‌' కు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) నోటీసు జారీ చేసింది. నగరం నడిబొడ్డున MG రోడ్ సమీపంలోని రత్నమ్స్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్, అవసరమైన అగ్నిమాపక భద్రతా చర్యలు లేకుండా, అగ్నిమాపక శాఖ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సామాజిక కార్యకర్తలు కుణిగల్ నరసింహమూర్తి, హెచ్‌ఎం వెంకటేష్‌ల ఫిర్యాదు మేరకు బీబీఎంపీ నోటీసులు రావడంతో శాంతినగర్‌ బీబీఎంపీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఏడు రోజులలోపు స్పందన రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెంగళూరు మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు. గతంలో కూడా రెస్టారెంట్ ఇతర విషయాల కారణంగా వార్తల్లో నిలిచింది. రాత్రి సమయంలో అనుమతించిన సమయానికి మించి రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Next Story