IND vs ENG: తొలి రెండు టెస్టులకు విరాట్‌ కోహ్లీ దూరం

జనవరి 25 నుంచి భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడాల్సివుంది.

By Medi Samrat  Published on  22 Jan 2024 10:22 AM GMT
IND vs ENG: తొలి రెండు టెస్టులకు విరాట్‌ కోహ్లీ దూరం

జనవరి 25 నుంచి భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడాల్సివుంది. తొలి మ్యాచ్ గురువారం నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు మూడు రోజుల ముందు టీమ్‌ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సమాచారం ఇచ్చింది.

విరాట్ కోహ్లీ తన పేరును ఎందుకు ఉపసంహరించుకున్నాడనే దానిపై నిర్దిష్ట సమాచారం రాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ తన పేరును ఉపసంహరించుకున్నట్లు బీసీసీఐ తన ఎక్స్-పోస్ట్‌లో రాసింది. మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లకు మాత్రమే బీసీసీఐ భార‌త‌ జట్టును ప్ర‌క‌టించింది. విరాట్ త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో ఎవరు జ‌ట్టులోకి వస్తారో చూడాలి. మూడో టెస్టులో వ‌ర‌కూ విరాట్ తిరిగి వస్తాడా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.

తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ కుమార్, సిరాజ్, ముఖేష్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్.

Next Story