ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ను దక్కించుకోలేకపోయింది. కానీ విరాట్ కోహ్లీ కొత్త IPL రికార్డును సృష్టించాడు. స్టార్ బ్యాటర్ టోర్నమెంట్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న మొదటి భారతీయుడుగా నిలిచాడు. 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులతో సీజన్‌ను ముగించాడు కోహ్లీ.
కోహ్లీ కంటే ముందు డేవిడ్ వార్నర్ (3), క్రిస్ గేల్ (2) తర్వాత ఐపీఎల్ సీజన్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన మూడో వ్యక్తిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్‌లో కోహ్లి సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్ లో RCB అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 5-సార్లు ఛాంపియన్స్ అయిన CSKని ఓడించింది. అయితే బెంగళూరు రాజస్థాన్‌తో ఎలిమినేటర్‌లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ 2016లో తొలిసారిగా 973 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు, ఇది ఇప్పటికీ IPL రికార్డుగా మిగిలిపోయింది. ఇక ఈ సీజన్ లో CSK ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 583 పరుగులతో రెండవ స్థానంలో నిలవగా, రాజస్థాన్‌కు చెందిన రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లలో 573 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ - 15 మ్యాచ్‌ల్లో 741
రుతురాజ్ గైక్వాడ్ - 14 మ్యాచ్‌ల్లో 583
రియాన్ పరాగ్ - 16 మ్యాచ్‌ల్లో 573
ట్రావిస్ హెడ్ - 15 మ్యాచ్‌ల్లో 567
సంజు శాంసన్ - 16 మ్యాచ్‌ల్లో 531