విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ గురించి సోషల్ మీడియాలో ఒకటే మోత

అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ధరించారనే పుకార్లు గత నెల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి

By Medi Samrat  Published on  10 Nov 2023 6:38 PM IST
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ గురించి సోషల్ మీడియాలో ఒకటే మోత

అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ధరించారనే పుకార్లు గత నెల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. బెంగళూరులో నటి అనుష్క భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న వీడియో ఇటీవల వైరల్ అవ్వడంతో ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ వీడియో చూసిన అభిమానులు, అనుష్క గర్భవతి అని ఊహించేసుకున్నారు. ఆ వీడియోలో అనుష్క బెలూన్ స్లీవ్‌లతో వదులుగా ఉన్న నలుపు రంగు దుస్తులలో కనిపించింది. విరాట్ బూడిదరంగు టీ-షర్ట్, లేత గోధుమరంగు ప్యాంట్‌లో దుస్తులు ధరించాడు. అనుష్క ప్రెగ్నెన్సీ గురించి ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, ఈ జంట ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు.

వరల్డ్ కప్ మ్యాచ్‍లకు హాజరైన అనుష్క శర్మ బేబీ బంప్‌తో కనిపించడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అనుష్క శర్మ బేబీబంప్‌తో కనిపించింది. బెంగుళూరులోని ఓ హోట‌ల్‌లో ఈ జోడి మీడియా కంటపడ్డారు. త్వరలోనే బుల్లి కోహ్లీ రాబోతున్నాడని అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అనుష్క-విరాట్ జంటకు 2017లో పెళ్లి అయింది. అనంతరం నాలుగేళ్ల‌కు 2021 జనవరిలో అనుష్క‌శ‌ర్మ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి వామిక అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

Next Story