కాలం గడిచిపోతుంది.. వైర‌ల్ అవుతున్న కోహ్లీ వీడియో

Virat Kohli Sums Up 11 Years In Test Cricket With This Montage. విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి నిన్న‌టితో 11 ఏళ్లు పూర్తైంది.

By Medi Samrat  Published on  21 Jun 2022 9:47 AM GMT
కాలం గడిచిపోతుంది.. వైర‌ల్ అవుతున్న కోహ్లీ వీడియో

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి నిన్న‌టితో 11 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా విరాట్ త‌న కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నాడు. 11 ఏళ్ల క్రితం జూన్ 20న విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడ‌టం ద్వారా టెస్టు క్రికెట్‌లోకి కోహ్లి అరంగేట్రం చేశాడు. త‌న కెరీర్ విజ‌య‌వంతంగా 11వ యేడు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా కోహ్లీ త‌న‌ ల్యాప్‌టాప్‌లో దాచుకున్న‌ జ్ఞాపకాలను అభిమానుల‌తో పంచుకున్నాడు.

టెస్టు క్రికెట్‌లో కోహ్లీ విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్‌ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా కోహ్లి సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం KOO యాప్‌లో టెస్ట్ క్రికెట్‌లో త‌న‌కున్న మ‌ధుర‌ క్షణాలన్నింటినీ కవర్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

33 ఏళ్ల కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 101 టెస్టులు ఆడాడు. 49.95 సగటుతో 8,043 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 254 నాటౌట్. ఇటీవల కోహ్లి ఫామ్‌లో లేక స‌త‌మ‌త‌మవుతున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన డే-నైట్ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ సాధించాడు.

ఇక‌ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో 1-2తో సిరీస్ ఓడిపోవడంతో కోహ్లి భారత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విరాట్ 68 మ్యాచ్‌ల్లో సార‌థ్యం వ‌హించి 40 విజయాలతో భారత్‌కు అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు. త‌ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో గ్రేమ్ స్మిత్, అలన్ బోర్డర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, క్లైవ్ లాయిడ్ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

















Next Story