ప్రాక్టీస్‌లో దంచికొట్టిన కోహ్లీ.. పాక్‌కు కష్టమే
Virat Kohli smashes India bowlers during practice.ఆసియా కప్-2022 కోసం టీమ్ఇండియా సన్నాహకాలు మొదలుపెట్టింది.
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2022 8:07 AM GMTఆసియా కప్-2022 కోసం టీమ్ఇండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి టీమ్ఇండియా ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అందరి దృష్టి పరుగుల యంత్రం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోహ్లీ ఆసియా కప్‌లో తిరిగి మునపటి లయను అందుకోవాలని బావిస్తున్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. నెట్ సెషన్‌లో చెమటోడుస్తున్నాడు.
Virat Kohli's batting practice at the nets.#ViratKohli #INDvPAK pic.twitter.com/hFa6mLv62K
— Square Leg (@Cricket_Is_Here) August 25, 2022
ఇక యూఏఈ పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లు అనుకూలిస్తాయి గనక తొలి సెషన్‌లో కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్ల పై ఎదురుదాడికి దిగాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని ప్రాక్టీస్ బట్టి చూస్తే కోహ్లీకి గడ్డు రోజులు పోయి గుడ్ డేస్ వచ్చాయని పలువురు నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.