రైల్వేస్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. కానీ అతని వీరాభిమానులు 3వ రోజున అరుణ్ జైట్లీ స్టేడియంకు రావడం కొనసాగించారు. ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కి రాగానే, స్టాండ్‌లలో సంఖ్య పెరగడం ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో మళ్లీ భద్రతా ఉల్లంఘనలు జరిగాయి.
తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ పాదాలను తాకేందుకు ఓ అభిమాని మైదానంలోకి వచ్చాడు. శనివారం నాడు ముగ్గురు అభిమానులు తమ ఐకాన్ ను కలుసుకోవడానికి మైదానంలోకి పరుగెత్తుకుంటూ ఒకేసారి వచ్చారు. దీంతో మరోసారి భద్రతను ఉల్లంఘించారు. చాలా మంది పోలీసు సిబ్బంది, గ్రౌండ్ సెక్యూరిటీ వారిని అడ్డుకుని బయటకు పంపించారు. ఆస్ట్రేలియాలో భారత్ 3-1తో సిరీస్ ఓటమి తర్వాత దేశీయ మ్యాచ్‌లలో పాల్గొనాలని అంతర్జాతీయ స్టార్‌లను కోరుతూ BCCI ఆదేశించడంతో కోహ్లి రెడ్-బాల్ క్రికెట్‌కు 12 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు.