విరాట్ కోహ్లి సూపర్ ట్విస్ట్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..!
Virat Kohli requests BCCI for break in January.పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒక్క సారథే ఉంటే బాగుంటుందని బావించిన
By తోట వంశీ కుమార్ Published on 14 Dec 2021 12:29 PM ISTపరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒక్క సారథే ఉంటే బాగుంటుందని బావించిన సెలక్టర్లు విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. అయితే.. కోహ్లీ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా.. తనను వన్డే కెప్టెన్‌గా తొలగించడంతో కోహ్లీ అసహనంగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని కోహ్లీ బావిస్తున్నాడట. జనవరిలో తన కుమార్తె వామిక బర్త్‌డే ఉండడంతో విరాట్ తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. వామిక తొలి పుట్టిన రోజు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. రోహిత్‌కు వన్డే కెప్టెన్సీ ఇవ్వడంతోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ సెషన్‌లో తొడ కండరాల గాయం బారిన పడడంతో ఇప్పటికే దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో ప్రియాంక పాంచాల్‌ను ఎంపిక చేశారు. అయితే.. రోహిత్.. వన్డే సిరీస్ కల్లా కోలుకుంటాడని బీసీసీఐ బావిస్తోంది. దక్షిణాఫ్రికాలతో వన్డేలకు అతడే సారథ్యం వహిస్తాడని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపాడు. అయితే.. రోహిత్ గాయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇక దక్షిణాఫ్రికాతో ఈ నెల 26 నుంచి మూడు టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. జనవరి 19 నుంచి 26 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఆయా సిరీస్‌ల్లో పాల్గొనే జట్లను సెలక్టర్లు ప్రకటించారు.