ఆర్‌సీబీలో నాకు చోటుందా..? కోహ్లీకి ఆ ఆటగాడి రిక్వెస్ట్
Virat Kohli replies to Harry Kane. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్.. పుట్‌బాల్ అభిమానులకు పరిచయం
By Medi Samrat Published on
29 Nov 2020 3:15 AM GMT

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్.. పుట్‌బాల్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. అయితే ఈ పుట్‌బాలర్ కాస్తా క్రికెటర్‌గా అవతారం ఎత్తాడు. టెన్నిస్ బాల్‌తో ఇండోర్ నెట్స్‌లో బ్యాటింగ్ చేసిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ప్రొపెషనల్ క్రికెటర్ మాదిరిగా చక్కని షాట్లు ఆడాడు. బౌన్సర్లను సైతం అచ్చం క్రికెట్ ఆటగాడి మాదిరే తలకిందకు వంచుతూ తప్పించుకున్నాడు.
అయితే.. హ్యారీ బ్యాటింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. హ్యారీ వీడియోను షేర్ చేస్తూ కోహ్లీతోపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ట్యాగ్ చేశాడు. అంతేకాదు.. టీ20 మ్యాచ్‌ను గెలిపించే సత్తా నాలో ఉంది. వచ్చే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టులో నాకు చోటుంటుందా అని అడిగాడు. దీనికి ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. నీలో మంచి నైపుణ్యముంది మిత్రమా.. నిన్ను అటాకింగ్ బ్యాట్స్‌మన్‌గా తీసుకోవచ్చని అన్నాడు.
Next Story