కోహ్లీ ఔట్‌.. విహారీ ఇన్‌.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌

Virat Kohli out India opts to bat against South Africa.జోహానెస్‌బ‌ర్గ్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2022 1:45 PM IST
కోహ్లీ ఔట్‌.. విహారీ ఇన్‌.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌

జోహానెస్‌బ‌ర్గ్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు ప్రారంభానికి ముందే టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్ను నొప్పి కార‌ణంగా మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విరాట్ స్థానంలో తెలుగు ఆట‌గాడు హ‌నుమ విహారి జ‌ట్టులోకి వ‌చ్చాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో విజ‌యం సాధించిన భార‌త్‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తొలిసారి ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై సిరీస్ సాధించాల‌ని బావిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ద‌క్షిణాఫ్రికా ప‌ట్టుద‌ల‌తో ఉంది.

భార‌త ఇన్నింగ్స్‌ను మ‌యాంక్ అగ‌ర్వాల్‌, కేఎల్ రాహులు ఆరంభించారు. మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 13 ప‌రుగులు చేసింది. మ‌యాంక్ 12, రాహుల్ 1 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

భారత జ‌ట్టు : కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

సౌతాఫ్రికా జ‌ట్టు : డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌, డువానే ఒలివర్‌, లుంగి ఎంగిడి.

Next Story