జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ చివరి రెండు రౌండ్ల కోసం ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది. 22 మంది సభ్యులతో కూడిన జట్టులో విరాట్ కోహ్లికి స్థానం కల్పించారు. ఇదే జట్టులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఈ సీజన్‌లో ఆయుష్ బదోనీ ఢిల్లీ రంజీ ట్రోఫీ జట్టుకు నాయకత్వం వహించాడు.
జనవరి 23 నుండి 25 వరకు రాజ్‌కోట్‌లో జరిగే తమ తదుపరి గ్రూప్ D మ్యాచ్‌లో ఢిల్లీ సౌరాష్ట్రతో తలపడుతుంది. ఆ తర్వాతి మ్యాచ్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 02 వరకు రైల్వేస్‌తో జరుగుతుంది. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012-13 సీజన్‌లో దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. సచిన్ టెండూల్కర్ చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడటానికి ఒక సంవత్సరం ముందు కోహ్లీ రంజీ ఆడాడు. ఇక రిషబ్ పంత్ చివరిసారిగా 2017-18 సీజన్‌లో దేశవాళీ మ్యాచ్ ఆడాడు.