కోపంతో ఊగిపోయిన విరాట్ కోహ్లీ.. థ్రిల్లర్ లో ఓటమి పాలైన ఆర్సీబీ

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ థ్రిల్లింగ్ సినిమాను తగ్గట్టుగా సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

By Medi Samrat  Published on  21 April 2024 3:17 PM GMT
కోపంతో ఊగిపోయిన విరాట్ కోహ్లీ.. థ్రిల్లర్ లో ఓటమి పాలైన ఆర్సీబీ

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ థ్రిల్లింగ్ సినిమాను తగ్గట్టుగా సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో కరణ్ శర్మ మూడు సిక్సర్లను బాది ఆర్సీబీని విజయానికి చేరువ చేశాడు. రెండు బంతుల్లో మూడు పరుగులు కావాల్సిన సమయంలో కరణ్ శర్మ అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. ఆఖరి బంతికి ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో కేకేఆర్ ఖాతాలోకి రెండు ఖాతాలు వచ్చాయి.

ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(18) వివాదాస్పద రీతిలో ఔట్ అయ్యాడు. హర్షిత్‌ రాణా వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి అతనికే క్యాచ్‌ ఇచ్చాడు. ఆ బంతి ఫుల్ టాస్ రూపంలో కాస్త ఎత్తులో రావడంతో నో- బాల్ కోసం కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఆ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీ అని చెప్పి.. కోహ్లీది ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై విరాట్, డుప్లెసిస్ మరోసారి ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో చర్చించారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఔట్ అని చెప్పడంతో కోహ్లీ అసహనంతో పెవిలియన్‌కు వెళ్లాడు. అయితే కోహ్లీ క్రీజులో నుండి కొంచెం ముందుకు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు అంపైర్ అంటూ చెబుతున్నారు.

Next Story